![]() |
![]() |
.webp)
కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో మాత్రం పిచ్చ కామెడీగా ఉంది. ఇందులో డిష్షులతో పాటు రకరకాల గెటప్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇందులో దీపికా రాధ గెటప్ లో , ఇమ్మానుయేల్ చిరంజీవి గెటప్ లో , అవినాష్ సీనియర్ ఎన్టీఆర్ గ, హరి బాలకృష్ణగా, రోహిణి శ్రీదేవిగా వచ్చారు. అవినాష్ చిరు గెటప్ డైలాగ్స్ చెప్పేసరికి "ఇంతకు మీరెవరు" అని అడిగింది శ్రీదేవి. ఏసిఎఫ్ సంస్థకు అధినేత. యాంటీ కుకింగ్ ఫోర్స్ " అని చెప్పాడు. ఇక అవినాష్ వచ్చి "మీరు నాతో సినిమా చేయాలనుకున్నారు కానీ చేయలేదు " అంటూ ఆలీకి చెప్పేసరికి "చేసానండి" అన్నాడు ఆలీ. తరవాత తనూజ దగ్గరకు వెళ్లి "మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతోంది" అంటూ డాన్స్ చేసాడు. తర్వాత హరి సుత్తి తీసుకుని వచ్చి సింహంలా గాండ్రించేసరికి శ్రీదేవి భయపడిపోయింది. అది సింహం సౌండ్ కాదు అంటూ ప్రదీప్ నవ్వేసాడు. తర్వాత రీతూ వచ్చింది. ఎవరు అని ఇమ్ము చిరంజీవిలా అడిగేసరికి "సిమ్రన్ " అని ప్రదీప్ చెప్పాడు. "సాంబ్రాణి వేసేదిలా ఉంది ఇది సిమ్రన్ ఏంటి" అన్నాడు. "నిన్న కుట్టేసినాది మొన్నా కుట్టేసినాది గండుచీమ " అన్నాడు హరి. "అందుకే ముఖం ఇలా అయ్యిందా" అన్నాడు ఇమ్మానుయేల్. తరువాత "మానవా " అంటూ రోహిణి శ్రీదేవి గెటప్ లో వచ్చేసరికి "నువ్వు మారవా..నేను మానేస్తా మీరూ మానేయండి " అన్నాడు నిఖిల్. "చిన్నప్పటి నుంచి అందరూ నన్ను రాధ రాధ అని పిలిచేవారు " అంటూ దీపికా చెప్పుకొచ్చింది. ఇక అవినాష్ ఎన్టీఆర్ గెటప్ లో వెళ్లి రాధా అని అరిచాడు. "లాస్ట్ మూవీ నీతోనే చేశా కదా ఏఎన్ ఆర్ " అంది దీపికా. "నీకు దణ్ణం పెడతారా దీనికి చెప్పండి నేను రామారావు గారి గెటప్ వేశానని" అని అన్నాడు ఏడుస్తూ .
![]() |
![]() |